ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు వేయొచ్చు : సీ​ఈవో వికాస్ రాజ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న దృష్ట్యా.. ఈ ప్రక్రియకు ముందు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు గవర్నర్‌ అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. అయితే నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చని ఆయన వెల్లడించారు. అవే పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారికి ప్రత్యక్షంగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల స్వీకరణ నిలిపేస్తామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను సీసీ టీవీల ద్వారా రికార్డు చేస్తామని తెలిపారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు వేయవచ్చని.. అఫిడవిట్ల విషయంలో అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థులిచ్చిన అఫిడట్లను అదే రోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయిస్తామని చెప్పారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ నవంబరు 10వ తేదీలోగా ఓటు హక్కు కేటాయిస్తామని వికాస్ రాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news