Chandrababu-Pawan Kalyan : జనసనే పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చర్చలు జరిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీతో పొత్తు వంటి అంశాలపై చర్చించారు ఇరువురు నేతలు.
వీరి సమావేశంపై నాదెండ్ల మాట్లాడుతూ… సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.. రెండున్నర గంటల పాటు జరిగాయన్నారు. చర్చలు సంతోషకరంగా జరిగాయని నాదేండ్ల పేర్కొన్నారు. ఎన్నికల వ్యూహంపైన చర్చించామని.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చించామని పేర్కొన్నారు. ఇరు పార్టీల క్యాడర్, నేతలు కలిసికట్టుగా పని చేస్తాం..YSRCP విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తున్నామన్నారు నాదెండ్ల మనోహర్. ఈ తరుణంలోనే.. జనసేన కు 24 సీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 24 సీట్లు కేటాయిస్తున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అలాగే.. రెండు ఎంపీలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.