Jagan: ఓటాన్ అకౌంట్ తప్ప…రెగ్యులర్ బడ్జెట్ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు !

-

Jagan: ఓటాన్ అకౌంట్ తప్ప…రెగ్యులర్ బడ్జెట్ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్‌. ఇవాళ మీడియాతో జగన్‌ మాట్లాడుతూ… బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చురకలు అంటించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

Chandrababu’s order to remove the barricades set up on Karakatta Road behind Jagan’s residence

రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదని సెటైర్లు పేల్చారు జగన్‌. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని డిమాండ్‌ చేశారు. మోసపూరిత హామీలపై నిధులను బడ్జెట్ లో చూపించక పోతే ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళనకు దిగుతారు అని చంద్రబాబుకు తెలుసు అన్నారు.

రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది అని ఇలా చేస్తున్నారని… ప్రజలను భయానక వాతావరణంలో ఉంచటానికి దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news