చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలవి తప్పుడు ప్రచారాలు అంటూ కొట్టి పారేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండి పడ్డారు. చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులకు అనిపిస్తే కోర్టుకు విన్నవించుకోవాలి. జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు.
ఆధారాలతో ఇప్పుడు చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబుకు అనారోగ్యమంటూ.. మాట్లాడుతున్నారు. ఎందుకు డ్రామాలు, నాకు చంద్రబాబు అభిమాని ఫోన్ చేసి ఏడవడం, అది ఓ ఛానల్ టెలికాస్ట్ చేయడం జిమ్మిక్ కాదా.. సానుభూతి కోసం కాదా అని బొత్స ధ్వజమెత్తారు. మేము కూడా చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటామని తెలిపారు. ఆయన అనారోగ్యంగా ఉంటే కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు. ఇలా జిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీనే అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.