బీఆర్ఎస్ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి.. మొదటి నుండి ఆయన గుణం అదే అన్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాని తెలిపారు. కేటీఆర్ బాత్ రూం లు కడిగేదని అంటవ..? గోడల మీద రాతలు రాసుకొనే బ్రతుకు నీది.
సంవత్సరానికి ఒక పార్టీ మారే వ్యక్తివి నీవు…కొండంగల్ లో చిత్తుచిత్తు ఓడిస్తే, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేశావ్… దమ్ముంటే రంగారెడ్డి నుంచి పోటీ చేయి.. నువ్వు రెండు సార్లు, పొన్నాల రెండు సార్లు ఓడిపోయారు, కానీ పొన్నాలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పెట్టినప్పటి నుంచి ఘోరంగ పడిపోతుంది.. 15 న బిఆర్ఎస్ పార్టీ మ్యానిపెస్టో విడుదల అవుతుంది…ఆ తర్వాత కాంగ్రెస్ మొత్తం పడిపోతుంది అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీలోకి వస్తే ఇంటికి వెళ్లి మరి స్వాగతిస్తాం అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.