వైఎస్‌ జగన్‌ నిండు నూరేళ్లు బాగుండాలి – చంద్రబాబు ట్వీట్‌ !

-

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిండు నూరేళ్లు బాగుండాలని ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయు డు ట్వీట్‌ చేశారు. ఇవాళ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికు… నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా… సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే, చంద్రబాబు చురకలు అంటించారు. నరసరావుపేటలో టీడీపీ ముస్లిం నేత షేక్ ఇబ్రహీం హత్య అత్యంత కిరాతక చర్య. పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఇది నిదర్శనం. పల్నాడును ఏం చేయాలనుకుంటున్నారో…ఈ హత్యాకాండ ఎందుకో…సీఎం సమాధానం చెప్పాలి? పల్నాడు జిల్లా అసమర్థ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version