Chandrababu with Pawan Kalyan : జనసన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన టిడిపి – జనసేన అధినేతల భేటీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పవన్ సతీమణి అన్నా లేజీనావో సాధారణంగా బయట కనిపించరు. ఆయన రాజకీయాల విషయంలోనైతే మొత్తానికి దూరంగానే ఉంటారు. అయితే భేటీ సందర్భంగా అన్నా కూడా కనిపించారు.
అందుకు సంబంధించిన ఫోటోల ను జనసేన పార్టీ ట్విట్టర్ లో పంచుకుంది. తమ ఇంటికి అతిథిగా వచ్చిన బాబును పవన్ దంపతులిద్దరూ కలిసి స్వాగతించారు. ఆ ఫోటోలను జనసేన వర్గాలు నెట్టింట షేర్ చేశాయి.
ఇది ఇలా ఉండగా, తరుణంలోనే.. జనసేన కు 24 సీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 24 సీట్లు కేటాయిస్తున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అలాగే.. రెండు ఎంపీలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.