ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ఇక నుంచి డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిచనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే.. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయనుంది జగన్ ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైయస్.జగన్.
ఈ కొత్త ఆరోగ్య శ్రీ కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ ఉంటుంది. 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలు, ఆరోగ్య శ్రీ యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఈ వర్చువల్ సమావేశంలో క్షేత్ర స్థాయి వైద్య, ఆరోగ్య సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తున్న జగన్ సర్కార్..ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయనుంది.