ఏపీ రైతులకు శుభవార్త…రూ.38.7 వేల కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం !

-

ఏపీ రైతులకు శుభవార్త…రూ.38.7 వేల కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సహకార సంఘాల్లో అవినీతి అక్రమాలతో మెక్కినదంతా కక్కిస్తామని…. అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి విన‌తులు స్వీక‌రించి మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు.

Image

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబాఉ సారధ్యంలో సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి ఒక్క రోజులో రైతుకు రుణం మంజూరు చేసేలా సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు. ఇందుకోసం సహకార సంఘాలను నూరు శాతం ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది సహకార సంఘాల ద్వారా రూ.38.7 వేల కోట్ల రుణాల మంజూరుకు ప్రణాళిక సిద్ధం. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచ్ ల ఏర్పాటు చేసి మరింత విస్తృతంగా సహకార సేవలు రైతులకు అందిస్తామని తెలియజేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news