నేటి నుంచి 3 రోజులపాటు కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాల్టి నుంచి దాదాపు మూడు రోజులపాటు కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మండపేట నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

తోండ్రేడు లో ఉన్న చంద్రబాబు నాయుడు… ఇవాళ మధ్యాహ్నం మడికి, దూల్ల మీదుగా ఏడిదకు వెళ్ళనున్నారు. ఇక అక్కడ రైతులతో రచ్చబండ నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం మండపేట కలప పువ్వు కూడలిలో నిర్వహించే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. ఇక రేపు కొత్తపేట ఎల్లుండి అమలాపురం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటన నేపథ్యంలో… ఆయా నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news