జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల్లో ఎన్నో మార్పులు చేసింది. నూతన పథకాలు తీసుకొచ్చింది. పేదవాళ్లకు ముఖ్యమైన ఆరోగ్య శ్రీ పథకంలో కూడా ఎన్నో మార్పులు చేస్తూ.. జగన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజారోగ్యానికి పెద్ద పీఠవేసిన జగన్ ప్రభుత్వం అందులో భాగంగానే ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు వచ్చే వారికి పూర్తి వివరాలు తెలియజేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైద్యం ఖర్చు వెయ్యిదాటితో ఈ పథకం అమలులోకి వస్తుందనే ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే!
స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన తన క్యాంపు ఆఫీస్ నుంచి కలక్టర్లు,జేసీలు,ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఆ స్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌వోపీ ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు.
జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర విషయాలపైన చర్చించారు. గ్రామ వార్డు సచివాలయాలు, ఆర్పీకేలు,బల్క్ మిస్క్ కూలింగ్ యూనిట్లు తదితర భవనాలు నిర్మాణం వచ్చే ఏడాది ౩1లోగా పూర్చిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.10కోట్లు విలువైన పనులు జరగాలని వాటిని సకాలంలో పూర్తి చేస్తే మరో రూ. 5కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.