తూ.గో లో కనిపించకుండా హడల్ పుట్టిస్తున్న చిరుత పులి..!

-

తూర్పుగోదావరి జిల్లాలో చిరుత పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజులుగా చిరుతపులి జాడ లేదు. అయితే చిరుత పులి జాడ లేకపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ట్రాప్ కెమెరాలను స్థాన మార్పులు చేసి అదనపు ట్రాప్ కెమెరాలను అమర్చారు అటవీ శాఖ అధికారులు. మెత్తంగా 100 ట్రాప్ కెమేరాలను వినియోగిస్తున్నారు.

అయితే చిరుతపులిని ట్రాప్ చేసి పట్టుకోవడానికి 7 బోనులను అమర్చి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దివాన్ చెరువు అటవీప్రాంతం శ్రీరాంపురం గ్రామ సమీపంలో అమర్చిన ట్రాప్ కెమేరాలో అడవి పిల్లి గుర్తించారు అధికారులు. అయితే ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుతపులి సందరిస్తున్నట్లు నిర్ధారణ లేదు. కానీ ఈ విషయంలో అందరూ అటవీశాఖ అధికారులకు సహకరించగలరు అని.. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దు అని.. ఫేక్ మేసేజ్ లకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది అని జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి ఎస్.భరణి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news