విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే..?

-

తెలంగాణలో ఇటీవలే విద్యార్థులు వరుసగా మూడు, నాలుగు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. రెండో శనివారం, ఆదివారం, మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం వంటి సెలవులు వచ్చాయి. ఇక మరో 12 రోజుల్లోనే 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ప్రధానంగా తెలంగాణలో అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. బోనాలు, బతుకమ్మ అదే రేంజ్ లో దసరా పండుగను జరుపుకుంటారు.

దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు తాజాగా సెలవురు ప్రకటించారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15న పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకాడమిక్ క్యాలెండర్ పేర్కొంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 01వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. అక్టోబర్ 15న పున: ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news