టీటీడీకి ఆటబొమ్మగా మారిన చిత్తూరు కలెక్టర్

-

జిల్లాకు ఆయన ప్రధమ పౌరుడు కానీ టీటీడీకి మాత్రం ఆయన ద్వితీయ శ్రేణి పౌరుడులాగా కనిపిస్తూన్నాడు. వివిఐపిలు వస్తే లిస్ట్ తయారు చేసేది ఆయనే…. కాని ఆయన పేరే లిస్ట్ లో లేదంటు ఆపేసారు…..చిన్నపాటి వీఐపీని సైతం గుర్తించాల్సిన టీటీడీ ఏకంగా జిల్లా కలెక్టర్ ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉందా లేక ఆలయం విషయంలో కలెక్టర్ ది ఏముంది అని లైట్ తీసుకున్నారా అన్నది ఇప్పుడు చిత్తూరుజిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

శ్రీవారి దర్శనార్థం నిత్యం విఐపిలు తిరుమల వస్తుంటారు. దేశ రాష్ర్టపతి మొదలుకోని ప్రధాని, ఉపరాష్ర్టపతి, రాష్ర్ట గవర్నర్, వివిద రాష్ట్రాల సీఎంలతో పాటు శ్రీలంక, సింగపూర్ వంటి దేశ ప్రధానులు స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తూంటారు. వారి పర్యటన సమయంలో అంతా తానై వ్యవహరించే భాధ్యత చిత్తూరు జిల్లా కలెక్టర్ ది. వారి కార్యక్రమాన్ని రూపోందించడం మొదలుకోని…. వారి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తారు జిల్లా కలెక్టర్. కానీ అలంటి కలెక్టర్ విషయంలో టీటీడీ నిర్లక్షం ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చనియాంశంగా మారింది.

శ్రీవారి దర్శనార్థం రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల విచ్చేయాగా మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం రూపోందించి రాష్ర్టపతి కార్యలయానికి సమాచారం అందించారు కలెక్టర్. రాష్ర్టపతి కార్యాలయం నుంచి ఆమోదం పోందారు. అందులో భాగంగా శ్రీవారి ఆలయ సందర్శన సమయంలోను ముందస్తూగా 300మందికి కోవిడ్ పరిక్షలు నిర్వహించి ఎవరు ఎక్కడ వుండాలి అన్నది దిశానిర్దేశం చేసారు జిల్లా కలెక్టర్. కాన్వాయ్ ట్రయల్ రన్ తో పాటు…. శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లును స్వయంగా ముందు రోజే పరిశిలించి వెళ్ళారు కలెక్టర్ భరత్ గుప్తా.

కట్ చేస్తే రాష్ర్టపతి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. మహద్వారం గుండా రాష్ర్టపతి ఆలయ ప్రవేశం చేసారు. కలెక్టర్ తనతో పాటు రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ర్టపతి పర్యటన పర్యవేక్షణ కోసం నియమించిన ఐపియస్ అధికారితో కలసి బయోమెట్రిక్ ద్వారా ఆలయ ప్రవేశం చేస్తూంటే… టిటిడి విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. తాను జిల్లా కలెక్టర్ ను అంటున్నా ససేమిరా అన్నారు. లిస్ట్ ని నిర్దేశించే అధికారినే…. నీ పేరు లిస్ట్ లో లేదంటు వెనక్కి పంపేసారు. ఇంకేముంది కలెక్టర్ మనస్థాపం చెంది వెనుదిరిగారు. ఇప్పుడి సంఘటనే ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాష్ర్టపతి పర్యటన పర్యవేక్షణ చెయ్యవలసిన అధికారి లేకూండానే 10 నిముషాల పాటు రాష్ర్టపతి పర్యటన కోనసాగింది. చివరికి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో జిల్లా కలెక్టర్ కి ఆలయంలోకి అనుమతి లభించింది. వాస్తవానికి జిల్లా కలెక్టర్ కి మహద్వార ప్రవేశం వుంది…. అలాంటిది బయోమెట్రిక్ వద్ద అడ్డగించే అధికారం విజిలెన్స్ అధికారులుకు లేదు. జిల్లా మొత్తం కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థ కాగా…. టిటిడిలో మాత్రం కలేక్టర్ కి కనీస మర్యాద దక్కకూండా చేసారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. టీటీడీ ఉన్నతాధికారులు కలెక్టర్ కంటే సీనియర్ అధికారులు కావడంతో….. చివరికి కలెక్టర్ ని బుజ్జగించి అసలు అవమానమే జరగలేదంటూ టిటిడి పిఆర్వో ద్వారా ప్రకటన విడుదల చేసారు.

వాస్తవానికి కలెక్టర్ ఆధీనంలో జిల్లా సమాచార శాఖ ఉంటుంది.కానీ ఈ విషయంలో కూడా కలెక్టర్ పై టీటీడీ పెత్తనం చెలాయిస్తూ లేఖ విడుదల చెయ్యడం పై ప్రభుత్వ ఉద్యోగుల్లోనే విమర్షలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news