ఇరవైరెండు పై క్లారిటీ ఉంది కానీ రెండు పై లేదు!

-

ఏపీ రాజకీయాల్లో.. ప్రత్యేకించి అధికారపార్టీలో గతకొన్ని రోజులుగా హాట్ టాపిక్ లో నడుస్తున్న విషయం… జగన్ కేబినెట్ విస్తరణ గురించి. ఆషాడం పేరుచెప్పి గతకొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని జగన్ పోస్ట్ పోన్ చేశారని.. శ్రావణం రాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఎవరికి వారు లెక్కలేసేసుకుని ఎవరి అర్హతలను వారు కాలిక్యులేట్ చేసుకుంటున్నారట. ఈ విషయంలో డేట్ ఫిక్స్ అయ్యింది కానీ.. క్యాండిడేట్ల విషయంలో మాత్రం ఇంకా ఆ సందిగ్ధత అలానే ఉంది!

అవును… 22వ తారీఖున కేబినెట్ విస్తరణ ఉంటుందని డేట్ విషయంలో క్లారిటీ వచ్చింది కానీ… నాడు ప్రమాణస్వీకారం చేయబోయే ఆ ఇద్దరు మంత్రులూ ఎవరనేదానిపై ఏమాత్రం క్లారిటీ రావడం లేదు! ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజా వంటివారి పేర్లు వినిపించినా… సామాజికవర్గ సమతుల్యతలో భాగంగా వారిపేర్లు ప్రస్తుతానికి కనుమరుగయ్యాయనే చెప్పాలి. ఈ సమయంలో కొత్తగా తెరపైకి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి!

ఈ పేర్లలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆల్ మోస్ట్ కన్ ఫాం అంటున్న నేపథ్యంలో మరో సీటుకోసం బలమైన పోటీ సతీష్, అప్పలరాజు ల మధ్య ఉండొచ్చని అంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా అప్పలరాజు జిల్లా శ్రీకాకుళం నుంచి తాజాగా తమ్మినేని సీతారం పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఆయన కూడా పూర్తి కాంఫిడెంట్ గా ఉన్నారని.. కొత్త స్పీకర్ రాబోతున్నారని స్థానికంగా లీకులిస్తున్నారట!

దీంతో… 22వ తేదీ ఫిక్సయ్యింది కానీ.. ఆ ఇద్దరూ ఎవరనేదానిపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అసలు 22వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోయేది ఈ ఇద్దరు మంత్రులేనా లేక మరికొంతమంది పేర్లు తెరపైకి రావొచ్చా… అందులో ఒక ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఉండొచ్చా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి! మరి జగన్ టేబుల్ పై ఉన్న కాగితంలో ఎవరి పేర్లు లిఖించబడ్డాయనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news