విమాన ప్రయాణాల్లో ‘కరోనా’పై కొత్త నిబంధన.. ఏంటంటే?

-

విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఏంటంటే? విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు.

New condition For Air travellers
New condition For Air travellers

ఇంకా అంతేకాదు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉందట. వారు కరోనా వైరస్ చికిత్స తీసుకున్నట్టు ఆస్పత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపిస్తే ఈ అవకాశం ఇస్తారట. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కల్గించారు. కాగా ఇప్పుడు అంటే మూడు వారలు కానీ గతంలో అయితే ప్రయాణ తేదీకి ముందు ఏకంగా నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందేజేయాల్సి ఉండేది. ఏది ఏమైనా ఈ న్యూస్ విమాన ప్రయాణికులకు కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news