విదేశీ భాషా బోధన అమలు చేసేందుకు సీఎం జగన్ నిన్ఱయం తీసుకున్నారు. 9, 10 తరగతులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన అందించాలని.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనీ అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ నుంచి ట్యాబులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ కు అధికారులు తెలిపారు.

నిన్న విద్యాశాఖ పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు టాబ్ల పంపిణీ పై కీలక నివేదిక ఇచ్చారు.ట్యాబుల్లో పిల్లల సందేహాలను తీర్చే యాప్లను ఇన్స్టాల్ చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. పదవ తరగతి ఫెయిల్ అయిన వారిలో లక్ష 49 వేల మంది పునఃప్రవేశాలు పొందాలని వివరించారు. టీచర్లకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల బోధనలో మంచి మార్పులు వచ్చాయని.. గత సంవత్సరం టాబులు పొందిన ఉపాధ్యాయులు రోజుకు 77, విద్యార్థులు 67 నిమిషాలు పాఠ్యాంశాలను వింటున్నారని అధికారులు… సీఎం జగన్ కు తెలిపారు.