అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలి : చంద్రబాబు

-

ఇప్పటి వరకు 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. ఇదో పవిత్ర కార్యక్రమం. పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించాం అని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశుభ్రమైన, పౌష్టుకాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. రూ. 15తో మూడు పూటల అన్నం పెట్టే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. ప్రతి అన్న క్యాంటీన్లల్లో భోజనం చేస్తున్నారు. వరద సాయం కోసం చిన్నారులు మొదలుకుని చాలా మంది విరాళాలు ఇచ్చారు. మంచికి స్థానం ఉందని దాతలు నిరూపించారు.

ఇక అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలి. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును ప్రభుత్వం భరించగలదు. కానీ ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచేలా చేయడం కోసం విరాళాలు అడుగుతున్నాం.అన్న క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. సేవా కార్యక్రమాల పైనా ఈ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సేవా భావంతో పని చేసే కార్యక్రమాలను విమర్శలు చేయడం దివాళాకోరుతనమే అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news