గుడివాడకు తెదేపా ఎప్పుడూ రుణ పడి ఉంటుంది..!

-

పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెదేపా ఎప్పుడూ గుడివాడలో రుణ పడి ఉంటుంది. దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల ఆన్న క్యాంటీన్ లను మళ్లీ ప్రారంభించుకోవాల్సి వచ్చింది. గుడివాడలో మూడు అన్న క్యాంటీన్ లను పెడుతున్నాం. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ.

డొక్కా సీతమ్మ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానాన్నికి శ్రీకారం చుట్టారు. అరకొర సంపాదనతో జీవించే వారికి అన్న క్యాంటీన్ లు ఎంతగానో ఉపయోగపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 203 ఆన్న క్యాంటీన్ లను పెట్టాం… ఇందు కోసం 130 ఖర్చు చేశాం… 4 కోట్ల 60 లక్షల మంది కి భోజనం పెట్టాం. అన్న క్యాంటీన్ లను మూసేయొద్దని చెప్పినా పట్టించుకోలేదు…. ప్రభుత్వం పెట్టక పోయినా దాతలు పెడతారు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పినా వినలేదు. సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఆన్న క్యాంటీన్ లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. దీని కోసం సంవత్సరానికి 200 కోట్లు అవుతుంది. అయితే రోజుకి ఒక్కొక్కరికి మొత్తం 96 రూపాయలు అయితే తినేవారు 15 రూపాయల చెల్లిస్తే మిగిలింది ప్రభుత్వం, దాతలు చెల్లిస్తారు అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news