రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు..!

-

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయాం. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం. పంద్రాగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని దేవుళ్ళ మీద ఒట్టు వేసి చెప్పారు. కానీ ఈరోజు పంద్రాగస్టు వచ్చింది.. అయినా రుణ మాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తున్నాం అని తెలంగాణ కు రావాలని రాహుల్ గాంధీ ని పిలిచారు. అయితే రుణమాఫీ చేస్తున్నాం అని బోగస్ మాటలు చెబుతున్నారని తెలిసి రాహుల్ గాంధీ రావట్లేదు అని తెలిసింది.

అలాగే ఈ రోజు సీఎం స్పీచ్ లో రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి గా రాష్ట్రం గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. పార్టీ విలీనం అయిపోతుంది అని చిల్లర ప్రచారం చేస్తున్నారు. మేము బెయిల్ కోసం ఢిల్లీలో తిరుగుతుంటే బీజేపీ వాళ్ళను కలుస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారు. సొంత చెల్లె జైల్ లో ఉంటే బెయిల్ కోసం తిరిగినా తప్పేనా అని ప్రశ్నించిన కేటీఆర్.. త్వరలోనే కేసీఆర్ నియోజకవర్గాలుగా అందరిని కలుస్తారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news