మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… కోటి చెట్లు పెట్టాలని సంకల్పించాం. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుంది. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలి. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయం. భూమినే జలాశయంగా మార్చేలా ఇంకుడు గుంతల ద్వారా ప్రణాళికలు రచించాం. అడవుల్లో చెక్ డ్యాములు నిర్మించి.. భూగర్భ జలాలు పెంచేలా చేసేవాళ్లం. గత ప్రభుత్వం చెక్ డ్యాముల్లో మట్టిని కూడా తీయలేదు. ఇప్పుడు పవన్ వచ్చారు.. అన్నీ చేస్తారు అని అన్నారు.
ఇక అటవీ శాఖ.. పీఆర్ శాఖలు పవన్ వద్దే ఉన్నాయి. రాజధాని నడిబొడ్డున ఎకో పార్కు ఉండడం సంతోషంగా ఉంది. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోవాలని ఉంది. 2014లో మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం. 50 శాతం గ్రీన్ కవర్ ఏర్పడాలి. సీడ్ బాల్స్ ద్వారా చెట్ల పెంపకం చేపట్టాలి. 175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో రెండున్నర ఎకరాల్లో నగర వనాలను ఏర్పాటు చేస్తాం. జపనీస్ టెక్నాలజీతో మియాబాకి కార్యక్రమం చేపడతాం అని చంద్రబాబు పేర్కొన్నారు.