గురువారం సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీసీఆర్ కిట్ ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడిటేక్ జోన్ లో ఆర్టిపిసిఆర్ కిట్ ని అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. మంకీపాక్స్ ఆర్టిపిసిఎల్ కిట్.. ప్రపంచ వేదికపై మేక్ ఇన్ ఏపీ ఖ్యాతిని ఘనంగా చాటుతుందన్నారు.
ఈ కిట్ తయారీ బృందాన్ని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆర్టీపిసిఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కిట్ ని తక్కువ ధరతో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడిటేక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకి తెలిపారు.
ఇక కార్మికులకు త్వరలోనే పది లక్షల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. భీమా పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని అన్నారు. పరిశ్రమల భద్రత అంశంలో రాజీ పడవద్దు అన్నారు చంద్రబాబు. భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలని అధికారులను ఆదేశించారు.