రైతుల కోసం BRS పోరాటం.. రంగంలోకి కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతూ అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుతో పూర్తిగా కుదేలైంది. ఆ పార్టీ శ్రేణుల్లో అభద్రతా భావం పెరిగి చాలామంది పార్టీకి రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలలో చేరారు.

ఇక ఇప్పుడు కవిత విడుదలతో ఆ పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహం పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ రైతుల కోసం మరోసారి పోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. రుణమాఫీ పూర్తిగా కాలేదు, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు అనే అంశాలతో ప్రజలలోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని రేపు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సెప్టెంబర్ మొదటి వారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలలోకి రాబోతున్నారట. సభలు లేదా కార్నర్ మీటింగ్ లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పోరాటంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పైన, అటు దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ పైన కెసిఆర్ సమర శంఖాన్ని పూరిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news