ఇసుకలో జోక్యం వద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్..!

-

ఇసుకలో జోక్యం వద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలంటూ పరోక్షంగా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుంది. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలి.

మనం కొత్త మద్యం పాలసీ తెచ్చాం. నాణ్యమైన మద్యాన్ని రూ. 99కే ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు.. మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేయాలి. అమరావతికి పూర్వవైభవం తెస్తాం. కేంద్రం అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తోంది.. ఇంకా మరింత ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతికి నిధుల కొరత లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news