బీఆర్ఎస్ విజయాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు : హరీష్ రావు

-

కేసీఆర్ పాలన ఎంఎస్ఎంఈ‌ అభివృద్ధి… కానీ బీఆర్ఎస్ సాధించిన విజయాలను తమ ఘనతగా చెప్పుకోవడం శోచనీయం అని ట్విట్టర్ వేదికగా హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డా..తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయి. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాక.. ఉద్యోగాల కల్పనలో 20 శాతం వృద్ధిరేటు సాధించింది.

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ అభివృద్ధికి తాము చేసిన కృషి ఏంటో భవిష్యత్తు కార్యాచరణ ఏంటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయం అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news