నా దగ్గర చంద్రబాబులాగా డబ్బులు లేవు – సీఎం జగన్

-

నా దగ్గర చంద్రబాబులాగా డబ్బులు లేవు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దగ్గర ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉందని…. పోలింగ్‌కు ముందు టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ జరుగుతోంది.. ఎవరు అధికారంలో ఉంటే మీకు మంచి జరుగుతుందో మీ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓటేయండని కోరారు సీఎం వైఎస్‌ జగన్‌.

Cm Jagan about ap schemes

కోరుకొండ ప్రచార సభ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ…. రాజానగరం సిద్ధమా… 12 అయింది ఇంత మండుటెండలో కూడా చిక్కటి చిరునవ్వు కనబడుతుందన్నారు సీఎం జగన్. మరో 6 రోజుల్లో జరగబోతుంది కురుక్షేత్ర మహా సంగ్రామం… రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని వివరించారు. డిల్లీ పెద్దలతో చంద్రబాబు కుట్రలు పడుతున్నాడు…మీ పథకాలను ఆపేశాడని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. ఆఖరికి నేను కోర్టులో కేసు వేసేలా చేశాడు…వీళ్లు పథకాలను అడ్డుకున్నా.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news