నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

-

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగనుంది సీఎం జగన్‌ రోడ్ షో.

cm jagan bus yatra 5th day

పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. కదిరి పట్టణం చేరుకుని పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొననున్నారు సిఎం జగన్. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news