సీఎం జగన్ గొప్ప మనసు…చిన్నారి చికిత్సకు రూ.1 కోటి సాయం

-

సీఎం జగన్ మరోసారి గొప్ప మనసు చాటు కున్నాడు. నిన్న క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిశారు డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు. అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను కలిశారు చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే రూ.1 కోటి మంజూరు చేశారు సీఎం జగన్. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్‌ కూడా అందిస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీ.. నిన్న పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు. అనంతరం చిన్నారి హనీని ఆశీర్వదించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news