విజయవాడలోని గుణదలలో కొత్తగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభించారు సీఎం జగన్. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ హోటల్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టూరిజం పాలసీలో నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి హోటల్ హయత్ ప్లేస్ కు జ్యోతి ప్రజ్వలన చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ….ఏపీలో మంచి బ్రాండ్ ఉన్న హోటళ్లు రావాలని పేర్కొన్నారు. గ్లోబల్ ప్లాట్ ఫాం మీద ఏపీలో టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా టూరిజం పాలసీ రూపొందించామని.. 11 ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చి ప్రోత్సాహకాలిచ్చామని స్పష్టం చేశారు. ఏపీని వరల్డ్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని.. మరిన్ని హోటళ్లు రావాలి.. వారికి ప్రభుత్వ పరంగా ప్రొత్సాహకాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.