కంటోన్మెంట్ సీటులో రచ్చ..గెలిచేది ఎవరు?

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అంటే సాయన్న పేరు ఎక్కువ గుర్తొస్తుంది. అక్కడ నుంచి సాయన్న అయిదుసార్లు విజయం సాధించి..కంటోన్మెంట్ పై తనదైన ముద్రవేశారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి నుంచి గెలిచి సత్తా చాటారు. 2009లో ఓడిపోయిన..2014లో మళ్ళీ టి‌డి‌పి నుంచి గెలిచారు. ఇక తర్వాత తెలంగాణలో టి‌డి‌పి దెబ్బతినడంతో సాయన్న బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు.

2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఉపఎన్నిక జరగలేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధులపై సస్పెన్స్ నెలకొంది. బి‌ఆర్‌ఎస్ తరుపున ఎవరు బరిలో ఉంటారో క్లారిటీ లేదు. సాయన్న కుమార్తెకు కే‌సి‌ఆర్ అవకాశం ఇస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతుంది. మరో వైపు బి‌ఆర్‌ఎస్ యువనేత కృశాంక్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారని టాక్ ఉంది.

ఇలా కంటోన్మెంట్ బి‌ఆర్‌ఎస్ సీటుపై క్లారిటీ రాలేదు. అదే సమయంలో గజ్జెల నగేష్ సైతం రేసులో ఉన్నారు.  ఈయన 2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ నేతగా, విద్యార్థి నాయకుడిగా పేరున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌ రెండు పర్యాయాలు కంటోన్మెంట్‌ టికెట్‌ కోసం యత్నించారు. ఈ సారి కూడా రేసులో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ లో సైతం సీటు విషయంలో క్లారిటీ లేదు. కాంగ్రెస్ లో సర్వే సత్యనారాయణ, పిడమర్తి రవి రేసులో ఉన్నారు. అటు బి‌జే‌పి సైతం కంటోన్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరో క్లారిటీ లేదు.

మొత్తానికి కంటోన్మెంట్ లో మూడు పార్టీల అభ్యర్ధులు ఎవరో తెలియదుగాని..మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు మాత్రం జరగనుంది. ప్రస్తుతం ఇక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీకే ఆధిక్యం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news