సీఎం జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు రూ. 340.26 కోట్లతో నిర్మించబోయే వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. శంకుస్థాపన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కాగా, తొలి దశలో భాగంగా పైప్డ్ ఇరిగేషన్ పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లు అందించేలా పనులు చేపట్టనున్నారు. వాస్తావానికి వరికపూడిసెల పల్నాడుకు ఓ వరం లాంటింది. అలాంటి ఎత్తిపోతలకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆరు దశాబ్దాల చిరకాల స్వప్నం సాకారం నెరవేర్చనున్నానరు. పూర్తిగా పైప్ లైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టుగా వరికపూడిసెల ప్రాజెక్టు నిలువనుంది. రూ.340.26 కోట్లతో ఎత్తిపోతల తొలిదశ పనులు జరుగనున్నాయి. దీంతో పల్నాడు, ప్రకాశం జిల్లాలు సస్యశ్యామలం ఏడు గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే.. 20 వేల మంది జనాభాకు తాగునీరు అందనుంది.