దీపావళి వేళ కరెంట్ దొంగిలించిన మాజీ సీఎం.. కేసు నమోదు

-

కరెంట్ దొంగిలించారన్న ఆరోపణలతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామిపై కేసు నమోదైంది. దీపావళి పండుగ వేళ తన ఇంట్లో లైటింగ్ కోసం విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన కారణంగా కేసు నమోదు చేసినట్లు జయనగర పోలీసులు తెలిపారు. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన నివాసాన్ని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించగా.. బెస్కాం ఏఈఈ ప్రశాంత్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనపై కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించానని తెలిపారు. కేవలం టెస్టింగ్‌ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని.. తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తించి ఇంట్లో మీటర్‌ నుంచి విద్యుత్తు వాడుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. ఇది అక్రమమని భావిస్తే అధికారులు తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేపడితే జరిమానా కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news