‘పరిశ్రమ ఆధార్’  : జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని సీఎం యైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి పరిశ్రమకు ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట సర్వే జరగనుంది. కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను సర్వేలో తెలుసుకోనున్నారు.

cm jagan
 

సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయనుంది. అలాగే మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనుంది. ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనున్నారు. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news