భారత ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డ్ ని అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా ఎక్కువ రోజులు దేశాన్ని పాలించిన ప్రధానిగా ఆయన సరికొత్త రికార్డ్ సృష్టించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి రెండు సార్లు ప్రధానిగా 2,268 రోజులు పనిచేశారు. దీన్ని ప్రధాని మోదీ నేటితో అధిగమించారు. 2014 లో తొలిసారి మోడీ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ వ్యతిరేకతలో ఆయన ప్రధానిగా విజయం సాధించారు.
హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉన్నా సరే ఆయనను దేశ ప్రజలు ప్రధానిగా అంగీకరించారు. బిజెపిలో మరో సమర్ధనేత లేకపోవడం కూడా ఆయనకు అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశంగా చెప్తారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుధీర్గ కాలం పని చేసిన వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. 2019 లో మోడీ తన పనితీరుతో మరోసారి ప్రధానిగా ఎన్నికయి వాజపేయి రికార్డ్ ని అధిగమించారు.