నేడు భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ భోగాపురం విమానాశ్రయానికి జగన్ భూమి పూజ చేయనున్నారు.

రూ.3,500 కోట్లతో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2025 సెప్టెంబరు నాటికి ఇది పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం దాకా రూ.6,500 కోట్లతో చేపట్టనున్న ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్రం తన వాటాగా రూ.1,200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఈ రహదారి పూర్తయితే విశాఖపట్నం, విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయి.

విశాఖ ఐటీ సెజ్‌లో అదానీ డేటా సెంటర్‌, ఐటీ పార్క్‌, రిక్రియేషన్‌ సెంటర్‌, స్కిల్‌ వర్సిటీలకూ బుధవారం సీఎం శంకుస్థాపన చేస్తారు. చంద్రబాబు సీఎంగా ఉండగా 2019 ఫిబ్రవరిలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రన్‌వేకు సంబంధించి 40 ఎకరాల భూముల అంశం కోర్టు పరిధిలో ఉంది. మేం అధికారంలోకి వచ్చాక కోర్టు కేసులు పరిష్కారమై… అనుమతులు రావడంతో ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేస్తున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news