BREAKING : సీఎం జగన్ ఆస్పత్రి పాలయ్యారు. కాలి మడమ నొప్పితో బాధ పడుతున్న సీఎం జగన్.. ఆస్పత్రికి వెళ్లారని సమాచారం. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవోస్ సమావేశం అనంతరం పరీక్షలకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్ కు వెళ్ళనున్నారు సీఎం జగన్.
గత కొంత కాలంగా కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి జగన్… అరగంట పాటు విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్ పరీక్షలు నిర్వహించుకోనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు సీఎం జగన్.ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవోస్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా తాము ఎవరికి అన్యాయం చేయలేదని… వారు పక్కన పడేసిన అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ‘ఇచ్చిన హామీ మేరకు పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. వారికి మినిమం పేస్కేల్ అమలు చేస్తున్నాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించి కార్మికులకు అండగా నిలిచాం. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసాం. కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించాం’ అని హెచ్చరించారు.