కొన్ని నెలల క్రితం టెస్లాలో భారీ డేటా లీక్ అయిన విషయం తెలిసిందే. ‘ఇద్దరు మాజీ ఉద్యోగులు టెస్లా డేటా ప్రొటెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి డేటాను దుర్వినియోగం చేశారని విదేశీ మీడియా సంస్థ (హాండెల్స్‌బ్లాట్) మే 10వ తేదీన ప్రకటించింది.’ అని టెస్లా 18వ తేదీన విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.
ఈ డేటా చౌర్యంపై టెస్లా న్యాయపోరాటం చేస్తోంది. టెస్లా డేటాను మాజీ ఉద్యోగులు ఏ విధంగాను వాడుకోకుండా ఇప్పటికే కంపెనీ కోర్టు ఆదేశాలను పొందింది అని టెస్లా డేటా ప్రైవసీ అధికారి స్టీవెన్ ఎలెన్‌టుక్ తెలిపారు.. భవిష్యత్తులో చర్యలు తీసుకొనేలా కంపెనీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు.
అయితే ఈ లీకైన డేటాలో 2,400 కస్టమర్ కంప్లైట్లు, బ్రేకింగ్ సమస్యల ఫిర్యాదులు, ఫాంటమ్ బ్రేకింగ్‌కు సంబంధించిన సమస్యలున్నాయని సమాచారం. ఎలాన్ మస్క్ సెక్యూరిటీ నంబర్ కూడా లీకైన డేటాలో ఉంది. దాదాపు 100 జీబీ డేటా లీకైనట్లు తెలుస్తోంది.