ఇక రేపు సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు బహిరంగ సభలో మాట్లాడనున్నారు సిఎం జగన్. అనతరం తాడేపల్లి గూడెం వెళ్లనున్నారు సిఎం జగన్.
ఇక అటు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కడపలో జోన్-5 సమావేశం నిర్వహించనున్నారు. కడప, ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. బుధవారం ఉదయం బద్వేలు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు.