ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కు సీఎం జగన్ వెళ్లానున్నారు. ఈ నెల 24న అంటే రేపు సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్… ఈ మేరకు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్…అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా, ఇవాళ సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్.