ఈ నెల 21 వ తేదీన వెంకటగిరికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఇవాళ మీడియాతో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. నేతన్న నేస్తం కార్యక్రమం కోసంముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న వెంకటగిరికి వస్తున్నారని తెలిపారు. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిచి వేరే పార్టీలో చేరుతున్నారని ఆగ్రహించారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి. వెంకటగిరిలో కూడా ఇక్కడి ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరారన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ సమన్వయకర్తగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారని తెలిపారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి. ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి.