నేడు పల్నాడు జిల్లా లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు ఈ సందర్భంగా క్రోసూరు లో జగనన్న విద్యా దీవెన నాలుగవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విప్పర్ల వద్ద 7 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్.
అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద కృష్ణా నదిపై 60 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్.. బెల్లంకొండ నుండి క్రోసూరు మీదుగా అమరావతి వరకు 147 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరిగి తాడెపల్లి గూడెం కు బయలు దేరుతారు.