అదిరే టూర్ ప్యాకేజీ… కన్యాకుమారి, కొచ్చి, కుమరకోమ్, మదురై, మన్నార్ మొదలు ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు…!

-

కేరళ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడండి. కొత్త టూర్ ప్యాకేజీలతో మీరు కేరళ వెళ్లి వచ్చేయచ్చు. ఈ టూర్ ప్యాకేజీ తో తక్కువ ఖర్చు తో దక్షిణ భారతదేశాన్ని చూసి రావచ్చు. ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం… ఈ టూర్ ప్యాకేజీ 8 రోజులు. ఈ ప్యాకేజీ లో భాగంగా మీరు కేరళ, తమిళనాడును చూసి రావచ్చు. ఈ టూర్ ప్యాకేజీ లో అనేక ప్రసిద్ధ ప్రదేశాలు కూడా ఉంటున్నాయి. కన్యాకుమారి, కొచ్చి, కుమరకోమ్, మదురై, మన్నార్, రామేశ్వరం, త్రివేండ్రం ఈ ప్రదేశాలన్నీ కూడా మీరు చూసి రావచ్చు.

విమానం లో వెళ్లాల్సి వుంది. అయితే ఈ ప్యాకేజీ జైపూర్ నుంచి మొదలు అవుతుంది. x జైపూర్‌తో రామేశ్వరం ముడైర్ పేరు తో ఈ ప్యాకేజీ ని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుంది. ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే..

సింగల్ గా వెళ్తున్నట్టయితే మీరు రూ.68,090 చెల్లించాలి. అదే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లయితే ఒక్కొక్కరికి రూ.51,280 పే చెయ్యాలి. ఒకవేళ ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్నట్లయితే ఒక్కొక్కరికీ రూ.48,570 చెల్లించాలి. ఈ ప్యాకేజీ ని మీరు బుక్ చేసుకోవాలని అనుకుంటే అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news