ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ

-

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్న సీఎం… 10.45 నుంచి 10.50 వరకు మున్సిపల్ స్కూల్ ను సందర్శించనున్నారు.

10.55 నుంచి 11.15 వరకు నాయకులు, అధికారులను కలవనున్న సీఎం… సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగిస్తారు. కాగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోని కి రావడం ఎంతో శుభసూచికం అన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని పాండవగల్లు గ్రామస్తులు నిర్ణయించారు. తమ గ్రామ చెరువు కింద ఉన్న 20 ఎకరాల భూమిని స్థానిక నేతలు, అధికారులు అండదండలతో ఆక్రమించుకున్నారని వాపోయారు. ఆక్రమణలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, అందుకే జగన్ పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ గ్రామ చెరువును ఆక్రమనదారుల చెర నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news