జనసేనను అమ్ముకున్నాడు..ప్యాకేజ్ స్టార్ కు సీఎం పదవి అవసరం లేదంట అంటూ పవన్ కళ్యాణ్‌పై జగన్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు.
దండం పెట్టి పంపారని చురకలు అంటించారు జగన్. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదంట అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఏపీలో దోచుకుని..తెలంగాణలో బతుకుతున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి తో, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టు కునేది వీళ్లే…విడిపోయే ది వెళ్లే..పెళ్ళిళ్ళు చేసుకునేది వెళ్లే విడాకులు ఇచ్చేది వీళ్లే….చంద్ర బాబు ఏం చెపితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందని చురకలు అంటించారు సీఎం జగన్.