ఏపీ ప్రజలకు శుభవార్త.. మరో 2 నెలల పాటు జగనన్న ఆరోగ్య సురక్షా కొనసాగనుంది. జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ ను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ ను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్.

వచ్చే రెండు నెలల పాటు జగనన్న ఆరోగ్య సురక్షా కొనసాగనుంది. ఐదు దశల్లో జరుగనుంది జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్. ఎన్నికల వేళ ప్రజారోగ్యం పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ కింద ఇంటింటి ఆరోగ్య సర్వే, ఉచిత పరీక్షలు, మందులు, అవసరాన్ని బట్టి చికిత్స అందించనుది జగన్ ప్రభుత్వం. ఈ క్యాంపైన్ లో ప్రజాప్రతినిధులు అందరూ కచ్చితంగా పాల్గొనాలని తాజాగా నేతలు అందరికీ ఆదేశించిన సీఎం జగన్…జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ ను ప్రారంభించనున్నారు.