ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నిన్న సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సమావేశం అయ్యారు. విశాఖపట్నం లో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
ఇక విశాఖపట్నంలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది అదానీ సంస్థ. మొన్న మే నెలలో అదానీ డేటా సెంటర్ ను శంకుస్థాపన చేశారు సీఎం జగన్. దీని కోసం 190 ఎకరాల భూమిని కేటాయించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖలో నిర్మిస్తోంది అదానీ గ్రూప్. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది అదానీ గ్రూప్. అదానీ చేతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అతిపెద్ద పోర్టులు గంగవరం, కృష్ణ పట్నం ఉన్నాయి. అలాగే… 15 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థాపిస్తోంది అదానీ గ్రూప్.