ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

-

రేపు దసరా పండుగ అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభా కాంక్షలు చెప్పారు.

CM Jagan wishes the people of AP Dussehra
CM Jagan wishes the people of AP Dussehra

అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని పేర్కొన్నారు.

ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news