వీడియో.. అంబులెన్స్‌కు దారి ఇచ్చి.. శభాష్ అనిపించుకున్న సీఎం జగన్..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ఆయన సమాధికి నివాళిని అర్పించారు వైఎస్ జగన్. అనంతరం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.

jagan

ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా దీనికి ముందు ఉన్న సీఎం కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌ కు దారి ఇచ్చింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. జాతీయ మీడియాలో సైతం సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే వీడియో చూసిన నెటిజన్లు శభాష్ జగన్ అని తెగ పొగిడేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా జగన్ ఇలాంటి పనే చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news