సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడు పర్యటన ఫిక్స్ ఐంది. నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనకు బయలు దేరనున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనలో 2003 కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఈ సందర్బంగా 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు సీఎం జగన్. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. ఇందులో భాగంగానే ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్. నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.