వైసీపీ ఎంపీగా పోటీ చేయనున్న కమెడియన్ ఆలీ ?

-

కమెడియన్ ఆలీకి బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కమెడియన్ ఆలీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుంది. వైసీపీ తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలనే భావిస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.

Comedian Ali to contest as YCP MP

ఈ క్రమంలో ఇటీవల వైసిపి సామాజిక సాధికారత యాత్రలో కూడా పాల్గొన్నారు. ఆలీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే, టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు దీటుగా సినీ గ్లామర్ ను జోడించడంతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్ ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తుందట. కాకినాడ లేదా ఏలూరు నుంచి ఎంపీగా ఆయనను పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version